తెలుగు jok's
మగాడు
"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
"నాకేం? నేను మగాణ్ణి"
"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.
"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.
"నాకేం? నేను మగాణ్ణి"
"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
లింగం మావ - మూత్ర పరీక్ష
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు
"ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు లింగం మావ.
"Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది"
అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం మావ...
Disturbance
ఆసుపత్రిలో..."ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.
Doctor చక చక మందులు రాసిచ్చాడు.
Patient వెళ్ళిపోగానే-
"అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor.
"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు" నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి
లింగం మావ - సినిమా ticket
లింగం మావ సినిమాకెళ్లాడు. Tickets కోసం క్యూలో నిల్చున్నాడు.అతని ముందున్న వ్యక్తి టెకెట్లు తీసుకుంటున్నాడు.
"Golden circle tickets అయిపోయాయి. Diamond circle మాత్రమే ఉన్నాయి" చెప్పాడు సినిమా హాల్ వ్యక్తి
"సరే.. diamond circle ఇవ్వండి"
ఆ తర్వాతి వ్యక్తితో....
"మిగతా tickets అన్నీ అయిపోయాయి. Only balcony"
"సరే balconyయే ఇవ్వండి"
ఇప్పుడు లింగం మావ వంతు.
"house full" చెప్పాడు హాల్ వ్యక్తి.
"సరే... house fullలోనే ఇవ్వండి" చెప్పాడు లింగం మావ
నెక్లెస్
"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి."అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త.
ఏదో ఒకటి
ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది"ఏం చేస్తున్నావురా?" అడిగాడు నాన్న.
"నీ బొమ్మ వేస్తున్నాను నాన్న"
"అబ్బ గుడ్"
కాసేపటికి...
"బొమ్మ బాగా రావట్లేదు నాన్న" చెప్పింది వాసవి.
"సరేలే. వదిలేయ్"
"పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?"
కరువు
"ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?" ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్."అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
ఫలితం
భార్యను ఆశ్చర్యపరుద్దామని ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చేలోగా ఓ చీరకు ఫాలు కుట్టాడు సంతోష్.భార్య ఎంతో సంతషించింది. గాఢంగా ముద్దు పెట్టింది.
"ఇవి కూడా కాస్త కుట్టి పెడతారా? మీకు టైమున్నప్పుడే" మరో రెండు చీరలు భర్తకిస్తూ అందామె.
సీరియల్
"ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్సేమైనా చూస్తున్నావా వదినా?""అబ్బే... ఈ సీరియల్స్‌తో విసుగెత్తిపోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది"
"వాస్తవ జీవితమా? ఎప్పుడు మొదలైంది? ఏ ఛానల్లో వస్తున్నది? ఎన్ని గంటలకొస్తున్నది?"
సులభం
"మీ ఆవిడ అలా అప్పులమీదాప్పులు చేస్తూ సామాన్లు కొంటూంటే నా ముందుఏడ్చే బదులు ఆమెకే సర్ది చెప్పవచ్చు కదా?" అన్నాడు నరసింహం."ఆమెకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్ళకు సర్ది చెప్పటం సులభం రా నరసింహం" దిగులుగా అన్నాడు గోవిందం.
0 comments: